Monday, January 20, 2025

అక్కినేని ఉమెన్స్, ఎన్ఆర్ఐ ఆస్పత్రులపై ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆస్పత్రులపై ఇడి దాడులు చేస్తోంది. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి. గుంటూరులోని మంగళగిరిలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రులలో ఇడి, ఐటి అధికారులు తనిఖీలు చేపట్టారు. నాలుగు బృందాలుగా విడిపోయి ఇడి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. కోవిడ్ సమయంలో భారీగా అవతవకలకు పాల్పడినట్టు ఇడి గుర్తించి కేసు నమోదు చేసింది. కోవిడ్ ట్రీట్‌మెంట్ తీసుకున్న 1500 మంది వివరాలను రికార్డుల్లో చేర్చలేదని అధికారులు గుర్తించారు. మాన్యువల్ రశీదులు, నకిలీ రశీదులతో నిధులు మళ్లించారని అభియోగాలు వచ్చాయి. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఇంట్లో ఇడి సోదాలు చేస్తుంది. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి పాత మేనేజ్‌మెంట్ డైరెక్టర్ ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News