Monday, December 23, 2024

సీక్రెట్ లాకర్లలో రూ. 47 కోట్ల బంగారం, వెండి..

- Advertisement -
- Advertisement -

ID Raid on Bullion Company

న్యూఢిల్లీ: ఒక బ్యాంకు రుణ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఒక బులియన్ కంపెనీకి చెందిన రహస్య లాకర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం తనిఖీ చేయగా రూ.47కోట్లకు పైగా విలువచేసే 431 కిలోల బంగారం, వెండి వస్తువులు లభించాయి. పరేఖ్ అలూమినెక్స్ లిమిటెడ్ అనే కంపెనీపై నమోదైన కేసుకు సంబంధించి రక్ష బులియన్, క్లాసిక్ మార్బుల్స్‌కు చెందిన కార్యాలయాలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించినట్లు ఇడి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులలో రక్ష బులియన్ కార్యాలయంలో కొన్ని రహస్య ప్రైవేట్ లాకర్ల తాళాలు లభించాయని ఇడి వివరించింది. ఆ ప్రైవేట్ లాకర్లను తనిఖీ చేయగా నియమ నిబంధనలు విరుద్ధంగా లాకర్ నిర్వహణ జరుగుతున్నట్లు తేలిందని పేర్కొంది. కెవైసి లభించలేదని, ప్రాంగణంలో ఎక్కడా సిసి టివి కెమెరా ఏర్పాటు చేయలేదని, సందర్శకులకు సంబంధించిన రిజిస్టర్ లేదని ఇడి తెలిపింది. ఆ ప్రైవేట్ భవనంలో 761 లాకర్లు ఉండగా రక్ష బులియన్‌కు చెందినవి మూడు ఉన్నాయని తెలిపింది. లాకర్లను తెరిచి చూడగా 91.5 కిలో బంగారు కడ్డీలు, 152 వెండి వస్తువులు లభించాయని, దీనికి అదనంగా రక్ష బులియన్ కార్యాలయంలో 188 కిలోల వెండిని స్వాధీనం చేసుకోన్నామని ఇడి తెలిపింది.

ED Raids on Bullion Company

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News