Saturday, November 23, 2024

లోన్ యాప్ సంస్థలపై ఇడి కొరడా

- Advertisement -
- Advertisement -

నాలుగు సంస్థలకు చెందిన రూ. 86కోట్ల జప్తు

మనతెలంగాణ/హైదరాబాద్: లోన్‌యా ప్ కేసులో నగరంలోని కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, పయనీర్ లిమిటెడ్ సంస్థలపై ఇడి అధికారులు దాడులు నిర్వహించి రూ.86.65 కోట్లను ఫ్రీజ్ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు లోన్‌యాప్ కేసులో ఇడి అధికారు లు బ్యాంక్ ఖాతాలలో ఉన్న రూ.186 కోట్ల నగదును ఫ్రీజ్ చేయడం జరిగింది. తాజాగా కుడుస్ ఫైనాన్స్, ఎస్ మనీ, రహినో, ఈ డబ్బును కంపెనీల ప్రతినిధులు హవాలా ద్వారా విదేశాలకు చైనా కంపెనీలు ఆ డబ్బు పంపించాయని ఇడి నిర్ధారించింది.గతంలో కుడోస్ కంపెనీకు చెందిన రూ.72.32 కోట్లు ఇడి అధికారులు జప్తు చేశారు. ఇప్పటి వరకు ఈ నాలుగు కంపెనీలకు సంబంధించి రూ.158.97 కోట్లు జప్తు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ నాలుగు కంపెనీలు 940.46 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా చైనీస్ కంపెనీలతో కుమ్మక్కై అమాయకులను మోసం చేసినట్లు ఇడి దర్యాప్తులో తేలింది.

ఇదిలావుండగా నగర పోలీస్ శాఖ కూడా లోన్ యాప్ మోసాల మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి లోన్‌యాప్‌ల నిర్వహకులను అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారు. కాగా 221 యాప్‌లు చట్టవిరుద్ధంగా రుణాలు ఇస్తున్నాయని, వాటిలో చాలా యాప్స్ నకిలీవని తేలడంతో వాటిని వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని రాష్ట్ర పోలీసులు గుగుల్‌కు లేఖ రాశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చట్టవిరుద్ధమైనన యాప్‌ను గుర్తించి వాటిని గుగుల్ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టినట్లు ఓ పోలీస్ అధికారి వివరించారు. ఈ తరహా యాప్స్ మరిన్ని ఉంటే వాటిని గుర్తించి, గూగుల్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లి తొలగిస్తామని తెలిపారు.

ఇది జరిగింది 

నగరంలోని కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇజీ మనీ, పయనీర్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థలు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు ఇడి విచారణలో తేలింది. ఈ సంస్థలు చైనా కంపెనీలతో కుమ్మక్కై లోన్‌యాప్‌ల ద్వారా రుణాలతో పాటు హవాల పద్దతిలో నగదును తరలించినట్లు ఇడి విచారణ చేపట్టింది. ఈ కంపెనీల నుంచి ఆన్‌లైన్ రుణయాప్‌లలో 7 రోజుల నుండి 30 రోజుల వరకు తక్షణ వ్యక్తిగత రుణాలను అందించేందుకు ఎన్‌బిఎఫ్‌సి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆన్‌లైన్ రుణ యాప్‌లలో వడ్డీ రేటు,ప్రాసెసింగ్ రుసుముల వసూలులో ఈ కంపెనీలు చైనీస్, హాంకాంగ్ చెందిన వ్యక్తుల సూచనల ఆధారంగా పనిచేస్తున్నాయని, ఈక్రమంలోనే పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఇడి అధికారుల దర్యాప్తులో వెలుగుచూసింది.

వివో కార్యాలయంలో ఇడి సోదాలు ః

మనీల్యాండరింగ్ ఆరోపణలపై చైనా మొబైల్ ఫోన్ కంపెనీలు లక్ష్యంగా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఇడి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వివో కార్యాలయంలో మంగళవారం నాటి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో వివోతో సంబంధాలు కలిగిన సంస్థల్లోనూ ఇడి అధికారులు దాడులు చేశారు. గతంలోనూ ఫెమా నింబంధనల ఉల్లంఘన కింద షియోమీ ఆస్తులను ఇడి అటాట్ చేసిన విషయంవిదితమే. కొద్ది కాలంగా చైనా మొబైల్ ఫోన్ కంపెనీలపై ఐటి, ఇడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News