Wednesday, January 22, 2025

ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ నివాసాలపై ఈడీ దాడులు

- Advertisement -
- Advertisement -

రాంచి : మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ అంబా ప్రసాద్, ఆమె సన్నిహితుల ఇళ్లపై ఈడీ ( ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ )అధికార సిబ్బంది మంగళవారం సోదాలు నిర్వహించింది. రాంచీ, మరికొన్ని నగరాల్లో దాదాపు 17,18 చోట్ల ఈ సోదాలు జరిగాయి. హజరీబాగ్ జిల్లా బర్కగావ్ నియోజకవర్గానికి చెందిన అంబా ప్రసాద్ ఇసుక మైనింగ్, ఇతర నేరాలతో సంబంధం ఉందని కేసులు నమోదు కావడంతో ఈ దాడులు జరిపినట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News