Tuesday, December 24, 2024

వివోపై ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

వివోపై ఇడి దాడులు
మనీలాండరింగ్ కేసులో 44 ప్రాంతాల్లో సోదాలు
న్యూఢిల్లీ: చైనా కంపెనీ వివోపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. సుమారు 44 ప్రాంతాల్లో ఈ కంపెనీకి చెందిన ప్రాంగణాల్లో ఇడి సోదాలు జరిపింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కూడా దర్యాప్తు చేస్తోంది. ఇతర చైనీస్ కంపెనీల మాదిరిగానే వివో కంపెనీని ఐటి, ఇడి లక్షంగా చేసుకున్నాయి. ఏప్రిల్‌లో వివో యాజమాన్యం, ఆర్థిక నివేదికలలో వ్యత్యాసాలు ఉన్నాయనే దానిపై విచారించింది.

ఇడి, సిబిఐతో పాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఈ కంపెనీలతో సంబంధం ఉన్న సంస్థలపై నిఘా ఉంచింది. ఆరు నెలల క్రితం షియోమీ, వన్ ప్లస్, ఒప్పోకు చెందిన అనేక స్థానాలపై దాడులు జరిగాయి. స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తున్న చైనా కంపెనీ షియోమీపై ఇడి దాడులు చేసింది. ఏప్రిల్‌లో బెంగళూరు కార్యాలయం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.5,551 కోట్లను స్వాధీనం చేసుకుంది. కంపెనీ తన ఆదాయాన్ని అక్రమంగా భారతదేశం నుండి బయటకు పంపిందని ప్రభుత్వం సంస్థ ఆరోపిస్తోంది. దేశంలోని మొబైల్ మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యం నడుస్తోంది. షియోమి, ఒప్పో, వివో వంటి కంపెనీలు బాగా సంపాదిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ గత కొన్ని సంవత్సరాలుగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లు, ఇతర రిపోర్టింగ్‌లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ED Raids on Vivo in 40 Locations

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News