Sunday, December 22, 2024

బీహార్‌లో ఆర్‌జెడి ఎమ్మెల్యేపై ఇడి దాడులు

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలకు సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆర్‌జెడి ఎఎమ్మెల్యే కిరణ్ దేవి, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే అరుణ్ యాదవ్, మరి కొందరి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. భోజ్‌పూర్ జిల్లాలోని సందేశ్ నియోజకవర్గానికి కిరణ్ దేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందారు.

తమ పార్టీ ఎమ్మెల్యేపై ఇడి దాడులు జరపడంపై బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ స్పందిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తమను చూసి భయపడుతోందని చెప్పడానికి ఇదే రుజువని చెప్పారు. ఆరా జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో అరుణ్ యాదవ్, కిరణ్ దేవిపై దాదాపు 16 కేసులు నమోదు కాగా వీటి ఆధారంగానే ఇడి మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News