Monday, January 6, 2025

రాజ్ కుంద్రా నివాసం, ఆఫీసుల్లో ఇడి అధికారుల సోదాలు

- Advertisement -
- Advertisement -

పోర్న్, అడల్ట్ చిత్రాల పంపిణీ ఆరోపణకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా వాణిజ్యవేత్త, సినీ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా నివాసం, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముంబయిలో సుమారు 15 చోట్ల, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో 49 ఏళ్ల కుంద్రా, మరి కొందరు వ్యక్తుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. ఇడి ఒక భవనంలో కుంద్రాను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కుంద్రా, తదితరులపై ముంబయి పోలీసులు దాఖలు చేసిన కనీసం రెండు ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్ల నేపథ్యంలో 2022 మేలో ఈ మనీ లాండరింగ్ కేసును ఇడి చేపట్టింది. కేసులో కుంద్రాను, మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. వారికి ఆ తరువాత బెయిల్ మంజూరైంది. కుంద్రాపై ఇది రెండవ మనీ లాండరింగ్ కేసు. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఒక క్రిప్టో కరెన్సీ కేసులో కుంద్రాకు. శిల్పా శెట్టికి చెందిన రూ. 98 కోట్లు విలువ చేసే ఆస్తులను ఇడి జప్తు చేసింది. అయితే, ఆ దంపతులు ఇడి జప్తు ఉత్తర్వునకు వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టు నుంచి ఉపశమనం పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News