Wednesday, January 22, 2025

తేజస్వి ఢిల్లీ నివాసంలో సోదాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శుక్రవారం బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో సోదాలు చేపట్టింది. బీహార్‌లో చోటుచేసుకున్న ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఏకకాలంలో పలువురు ఆర్జేడీ నేతలు , సంబంధిత వ్యక్తుల ఇళ్లపై దాడులకు దిగాయి. బీహారే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలలో సోదాలు జరిగా యి. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ము గ్గురు కుమార్తెలు, ఆర్జేడీ నేతల నివాసాలపై మనీలాండరింగ్ కేసులలో సోదాలు నిర్వహించడంతో రాజకీయ వేడి అలుముకుంది. ఓ వైపు ఢిల్లీలోని తేజస్వీ నివాసంలో ఇదే దశలో లాలూ కూతుళ్లు రాగిణి యాదవ్, చందా యాదవ్, హేమా యాదవ్ ఇళ్లలోనూ సోదాలు జరిగా యి. ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే అబూ దోజ్నాకు చెందిన పా ట్నా నివాసంలో, పుల్వారీ షరీఫ్, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాం తం, రాంచీ, ముంబైలలో కూడా సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.

దాదాపు 24 చోట్ల పెద్ద ఎత్తున ఇడి బృందాలు, కేంద్రీయ భద్రతా బలగాలు వెంటరాగా హుటాహుటిన సోదాలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగ మారింది. ఇక ఢిల్లీలో తేజస్వీ యాదవ్‌కు చెందిన దక్షిణ ఢిల్లీలోని నివాసంలో కూడా సోదాలు జరిగాయి. అయితే ఈ దశలో ఆయన అక్కడ ఉన్నదీ లేనిది తెలియలేదు. బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్‌యాదవ్ ఇటీవలే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ తరువాత స్వదేశానికి వచ్చారు. కొద్దికాలం విశ్రాంతి తరువాత రెండు మూడు రోజుల క్రితమే లాలూను, ఆయన భార్య, మాజీ సిఎం అయిన రబ్రీదేవిలను సిబిఐ విచారించింది. మంగళవారం ముందు రబ్రీదేవిని విచారించిన తరువాత మరుసటి రోజు బుధవారం లాలూను ప్రశ్నించారు. ఇప్పుడు ఇడి తదనంతర సోదాలకు దిగింది. ఈ స్కాంకు సంబంధించి సిబిఐ లాలూ, రబ్రీ, 14 మంది ఇతరులపై ఛార్జీషీట్లు దాఖలు చేసింది. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం పరిధిలో అభియోగాలు మోపారు. కాగా వీరిని ఈ నెల 15వ తేదీన విచారణకు రావల్సిందని సమన్లు వెలువరించారు.

ఇప్పు డు మనీలాండరింగ్ సంబంధిత అంశంపై నిజానిజాల నిర్థారణకు ఇడి రంగంలోకి దిగిందని వెల్లడైంది. బీహార్‌లో ఆర్జేడీజెడియూల ప్రభుత్వం ఉంది. విపక్ష పాలిత ప్రభుత్వాలను, విపక్ష నేతలను టార్గెట్‌గా చేసుకుని ఇడి సిబిఐల ద్వారా కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని విపక్ష నేతలు విమర్శిస్తూ వస్తున్న దశలోనే ఇప్పటి సోదాలు జరిగాయి. ఇక సిబిఐ ఫిర్యాదు ప్రాతిపదికన ఇప్పుడు ఆర్జేడీ నేతలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోని క్రిమినల్ సెక్షన్స్ ప్రకారం కేసులు దాఖలు అయ్యాయి.
లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకూ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రీయ రైల్వేలోకి అక్రమంగా అభ్యర్థులను ఉద్యోగాలలోకి తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియమనిబంధనలను ఉల్లంఘిం చి ఈ నియామకాలు పెద్ద ఎత్తున జరిగాయని, రిక్రూట్‌మెంట్ల జాతీయ పాలసీని పట్టించుకోలేదని పేర్కొంటూ ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే లాలూ మాజీ ఒఎస్‌డి భోళా యాదవ్ అరెస్టు
ఈ రైల్వే ఉద్యోగాల స్కామ్‌కు సంబంధించి సిబిఐ ఇప్పటికే భోళా యాదవ్‌ను మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. భోళా యాదవ్ గతంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు లాలూకు ఒఎస్‌డిగా ఉన్నారు. ఇక రైల్వే ఉద్యోగిగా ఉన్న హృదయానంద్ చౌదరి, కుంభకోణంలో మరో లబ్థిదారుడిగా భావిస్తున్న ధర్మేంద్ర రా య్‌ను కూడా అరెస్టు చేశారు. లాలూ ఆయన కుటుంబ సభ్యులు రైల్వే ఉద్యోగాలు ఇప్పించడం ద్వారా భారీ ఎత్తున ప్లాట్లు, భూములను పొందారని సిబిఐ తేల్చింది. భూములు, స్థలాలను లంచాలుగా ముడుపులుగా తీసుకుని ఈ వ్యవహారం సాగించారని అభియోగాలు మో పింది. ఈ కేసు దర్యాప్తు క్రమంలోనే గత ఏడాది ఆగస్టులో పలు చోట్ల సోదాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News