Tuesday, November 5, 2024

పంజాబ్‌లో ఈడీ దాడులు.. సీఎం చన్నీ బంధువు ఇంట్లో సోదాలు

- Advertisement -
- Advertisement -

ED raids the house of relatives of Punjab CM

చండీగఢ్ : పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి సాగుతున్న సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఈ సోదాలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ బంధువు భూపిందర్ సింగ్ హనీ నివాసంతోపాటు మరో 10 ప్రాంతాలో తనిఖీలు చేపట్టారు. చండీగఢ్, మొహలి, లూథియానా, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. చన్నీ మరదలి కుమారుడైన భూపిందర్ సింగ్ హనీ… పంజాబ్ రియల్టర్స్ పేరుతో నిర్వహిస్తున్న సంస్ధ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, కోట్లకొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ దాడులకు చన్నీ స్పందిస్తూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి సిఎం మమతా బెనర్జీ బంధువుల ఇళ్లపై ఇదే విధంగా దాడులు జరిగాయని అదే విధంగా పంజాబ్‌లో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.ఈ విధంగా తనపైన, తన మంత్రులపైన కాంగ్‌స్ సభ్యుల పైన ఒత్తిడి తేడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఒత్తిడిని తట్టుకోడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News