Monday, December 23, 2024

బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’లో భాగమే ఈడీ దాడులు: కాంగ్రెస్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీ ఉపయోగించే “ఆపరేషన్ లోటస్‌”లో భాగమే ఈడీ ( ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడులుగా ఛత్తీస్‌గఢ్ లోని అధికార కాంగ్రెస్ సోమవారం వ్యాఖ్యానించింది. ఛత్తీస్‌గఢ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గిరీష్ దేవాంగన్, రాయ్‌పూర్ మేయర్ అయిజాజ్ దేబర్, చత్తీస్‌గఢ్ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఛైర్మన్ సుషీల్ సున్నీ అగర్వాల్ కార్యాలయాలపైఈడీ దాదులు జరిగాయి.

ఈ ముగ్గురూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్‌లో సోమవారం పాత్రికేయుల సమావేశంలో ఈడీ దాడులపై వ్యాఖ్యలు చేశారు. బొగ్గు వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై ఈడీ దాడి జరిగిందని దేవాంగన్ ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకులను వేధించడానికే ఈడీ దాడులని దేబర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News