Thursday, January 23, 2025

బెంగళూరులోని రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ కార్యాలయాలపై ఈడి దాడులు

- Advertisement -
- Advertisement -

ED raids on payment gateways offices

 

బెంగళూరు: చైనా వ్యక్తులు నియంత్రణలో ఇన్ స్టాంట్ స్మార్ట్-ఫోన్ లోన్లు ఇస్తున్నారన్న ఫిర్యాదుపై బెంగళూరులోని ఆన్ లైన్  పేమెంట్ గేట్ వేస్ అయిన రేజర్ పే, పేటిఎం, క్యాష్ ఫ్రీ కార్యాలయాలపై  ఎన్ ఫోర్స్ మెంట్  డైరక్టరేట్(ఈడి) శనివారం దాడులు నిర్వహించింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఆరు ప్రాంగణాల్లో శుక్రవారం సోదాలు ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈడి తెలిపింది.

ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ ఈ దాడుల్లో “చైనీస్ వ్యక్తుల నియంత్రణలో ఉన్న ఈ సంస్థల వ్యాపారి ఐడిలు ,  బ్యాంక్ ఖాతాలలో ఉంచిన రూ. 17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకున్నట్లు’’ తెలిపింది. ఈ సంస్థల కార్యనిర్వహణ విధానం ఏమిటంటే, వారు భారతీయుల నకిలీ పత్రాలను ఉపయోగించి,  వారిని డమ్మీ డైరెక్టర్లుగా మార్చడం ద్వారా “నేరపు ఆదాయాల” తరానికి దోహదం చేస్తున్నారని ఆరోపించింది. “రేజర్ పే ప్రయివేట్ లిమిటెడ్, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, పేటీఎం  పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్,  చైనీస్ వ్యక్తులచే నియంత్రించబడే/నిర్వహించబడే సంస్థలు సెర్చ్ ఆపరేషన్‌లో కవర్ చేయబడ్డాయి” అని ఈడి తెలిపింది.

దర్యాప్తులో ఉన్న సంస్థలు వివిధ వ్యాపారి ఐడిలు/పేమెంట్ గేట్‌వేలు/బ్యాంకుల ఖాతాల ద్వారా నేరాల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి,  ఎంసిఏ(కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) వెబ్‌సైట్/రెజిస్టర్ఢ్  చిరునామాల అడ్రసులకు కూడా సరిపోని బూటకపు అడ్రసులు అవి. బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదయిన 18 ఎఫ్ఐఆర్ ల మీద  మనీలాండరింగ్ కేసు చేపట్టామని ఈడి పేర్కొంది. అక్రమ లావాదేవీలు, వేధింపులకు పాల్పడిన అనేక మంది ఈ కేసులో ఉన్నారని కూడా తెలిపింది. బాధితులంతా ఫోన్ యాప్స్ ద్వారా డబ్బు తీసుకుని వేధింపులకు గురయినవారేనని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News