Monday, December 23, 2024

భూపిందర్ సింగ్ ఇంటి నుంచి 3.9 కోట్ల నగదు ఈడీ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ED recovers Rs 3.9 crore more from Bhupinder Singh's residence

 

ఛండీగఢ్ : పంజాబ్ సిఎం చరణ్‌జిత్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు బుధవారం ఆ ఇంటి నుంచి దాదాపు 3.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఈడీ అధికారులు మొత్తం 10 కోట్ల నగదును రికవరీ చేసినట్టు తెలుస్తోంది. భూపిందర్ సింగ్ అలియాస్ హనీకి సంబంధం ఉన్న పలు ప్రదేశాల్లో మంగళవారం ఈడీ సోదాలు చేపట్టింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. డబ్బుతోపాటు డాక్యుమెంట్లు, ఎలెక్ట్రానిక్ పరికరాలను ఈడీ సీజ్ చేసింది.సుమారు 8 కోట్ల నగదును భూపిందర్ తో లింకున్న ప్రాంతాల నుంచి సేకరించారు. సందీప్ కుమార్ అనే వ్యక్తి ఇంటి నుంచి మరో రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News