Saturday, November 23, 2024

డేటా చోరీ కేసులో ఈడి ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో ఈడీ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 16.80 కోట్లమంది డేటాను చోరీ చేసి సోషల్ మీడియాలో విక్రయానికి పెట్టిన ఏడుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో నితేష్ భూషణ్, అతుల్ ప్రతాప్ సింగ్, పూజా, సుషీల్ తోమర్, ముస్కాన్ హాసన్, సందీప్ పాల్, జియా ఉర్ రెహ్మన్‌పై ఈడి పిఎంఎల్‌ఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరో 10కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటా చోరీ చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

పలు కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సురెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. డిఫెన్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగదారులు 7లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడిలు, పాస్‌వర్డ్‌లు సైబర్ నేరగాళ్లు చోరీ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News