Monday, December 23, 2024

చైనా వీసా కేసులో కార్తీకి అరకోటి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం చైనా వీసా కేసులో రూ 50 లక్షల లంచం తీసుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం అభియోగాలు మోపింది. కేంద్ర మాజీ హోం, ఆర్థిక శాఖ మంత్రి అయిన చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం. ఆయన తన అత్యంత సన్నిహితుడి ద్వారా అరకోటి తీసుకున్నాడనేది ఇడి అభియోగం. పంజాబ్‌లో విద్యుత్ కేంద్రం స్థాపించే ఓ కంపెనీకి చెందిన చీనీ ఉద్యోగి వీసాకు సంబంధించి కార్తీ తన అధికారాన్ని, పలుకుబడిని వినియోగించుకున్నాడని ,

హోం మంత్రిత్వశాఖ ద్వారా చైనా వీసా తిరిగి వాడుకోవడంలో సాయం చేశాడని ఇడి పేర్కొంది. కాగా కార్తీకి ఈ మొత్తం ఆయన అధీనంలో ఉన్న ఓ కంపెనీలోకి అక్రమ , తప్పుడు నగదు చెల్లింపుల లావాదేవీల ద్వారా చేరిందని కూడా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈ ఎంపి నుంచి ఈ కేసులో దర్యాప్తు సంస్థ పలుసార్లు వాంగ్మూలం తీసుకుంది. కాగా తిరిగి ఈ కేసు ప్రస్తావన వచ్చిన దశలో కార్తీ స్పందించారు. కోర్టులో విచారణ దశలో తమ లాయర్లు తగు సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News