Monday, December 23, 2024

కావాలనే ఇడి ఆర్జ్‌షీట్‌లో ఎంపి సంజయ్ సింగ్ పేరు: ఆప్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ పేరును ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) పొరపాటున చేర్చలేదని, ఉద్దేశపూర్వకంగానే చేర్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపించింది. తమ పార్టీని, ముఖ్యమంత్రి అరవంద్ కేజ్రీవాల్‌ను అప్రపతిష్ట పాల్జేసేందుకే ఇడి ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడిందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ మంత్రి, ఆప్ ప్రధాన అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ&రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, ఇత్రహింసలు, భయోత్పాతం కలిగించడం, బెదిరింపులు, అప్రతిష్ట పాల్జేయడం వంటి చర్యలకు ఇడి, సిబిఐ మారుపేరుగా మారిపోయాయని ఆరోపించారు. ఇడి తన చార్జిషీట్‌లో ఉద్దేశపూర్వకంగానే ఆప్ ఎంపి సంజయ్ సింగ్ పేరును చేర్చిందని, ఈ కుంభకోణంలో సంజయ్ సింగ్ పాత్ర ఉందని ఆ తర్వాత మీడియాకు ఇడి వెల్లడించిందని భరద్వాజ్ చెప్పారు.

Also Read: తమిళ నటుడు- దర్శకుడు మనోబాల కన్నుమూత

ఇడి అధికారులపై పరువునష్టం కేసు వేయడానికి అనుమతించాలని కోరుతూ సంజయ్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారని ఆయన తెలిపారు. చార్జ్‌షీట్‌లో పొరపాటున పేరును చేర్చినందుకు సంజయ్ సింగ్‌కు ఇడి అధికారులు క్షమాపణ చెప్పారని భరద్వాజ్ చెప్పారు. పొరపాటు చేసినందుకు ఒక వ్యక్తికి ఇడి క్షమాపణ చెప్పడం ఇదే మొదటిసారని, కేంద్ర ప్రభుత్వం కూడా సంజయ్ సింగ్‌కు, ఆప్‌కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఒక ఎంపి పేరును చార్జ్‌షీట్‌లో ఎలా చేరుస్తారని ఆయన ప్రశ్నించారు. పొరపాటున పేరును చేర్చామని ఇడి అధికారులు చెబుతున్నారని, బిజెపి ఎంపిల పేర్లు పొరపాటున ఎందుకు చేర్చలేదని, కేవలం ఆప్ ఎంపి పేరే ఎందుకు చేర్చాల్సి వచ్చిందని ఆయన ఇడిని నిలదీశారు. ఈ మొత్తం కుంభకోణమే ఒక కట్టుకథగా ఆయన అభివర్ణించారు.

Also Read: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 162వ స్థానంలో భారత్: 150వ స్థానంలో పాక్

తన పేరును చార్జ్‌షీట్‌లో చేర్చినందుకు ఇడి క్షమాపణ చెప్పాలని, లేదా సివిల్, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తూ సంజయ్ సింగ్ ఏప్రిల్ 22న ఇడి డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్‌కు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసు పంపారు. అయితే, టైపింగ్ పొరపాటు వల్ల రాహుల్ సింగ్ పేరు బదులు సంజయ్ సింగ్ పేరు చార్జ్‌షీట్‌లో ర్చేడం జరిగిందని, ఈ పొరపాటును సవరించుకుంటామని తెలియచేస్తూ ఏప్రిల్ 20న ఇడి పిఎంఎల్‌ఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఇడి వర్గాలు తెలిపాయి. సంజయ్ సింగ్ లీగల్ నోటీసుకు ముందే ఇడి పిఎంఎల్‌ఎ కోర్టులో పిటిషన్ వేసిందని, దీన్నిబట్టి ఇడి నిజాయితీ అర్థమవుతుందని ఇడి వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News