Sunday, January 19, 2025

కవిత బంధువుల ఇళ్లలో ఇడి సోదాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఇడి సోదాలు చేపట్టింది. కవిత ఆడబిడ్డ అఖిల, ఆమె భర్త బంధువుల ఇళ్ళలో ఇడి సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్ సి కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు 16 మంది అరెస్టు చేసింది. మీర్ మహేంద్రు, పి. శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, అమన్ ధాల్, అరుణ్ పిళ్లై, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, దినేష్ అరోరా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లను ఇడి అరెస్ట్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం 2022లో రూపకల్పన చేశారు. ఈ పాలసీ కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేవిధంగా తయారు చేశారని ఢిల్లీ సిఎం అరవింద్, కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితలపై ఇడి ఆరోపణలు చేసింది. సౌత్ గ్రూప్‌నకు లబ్ధి చేకూరేలా మధ్య పాలసీ విధానం ఉందని ఇడి ప్రధాన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News