Sunday, December 29, 2024

కవిత ఇంట్లో ఈడీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం ఈడీ సోదాలు చేస్తోంది. ఇద్దరు మహిళా అధికారులు సహా 8 మంది ఈడీ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. సోదాల సందర్భంగా అందరి వద్ద సెల్ ఫోన్లు, కవిత ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కవిత ఇంట్లో సోదాలు చేస్తున్నారు. దాడుల నేపథ్యంలో కవిత ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. బిఆర్ఎస్ లీగల్ కన్వీనర్ సోమ భరత్, లాయర్లు కవిత నివాసానికి చేరుకున్నారు. న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించబోమని ఈడీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News