Friday, December 27, 2024

బైజూస్ సిఇఓ రవీంద్రన్ ఇల్లు, ఆఫీసులలో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ సిఇఓ రవీంద్రన్ కార్యాలయం, ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంవ డైరెక్టరేట్ శనివారం వెల్లడించింది. విదేశీ మారకం ఉల్లంఘన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించినపుడు కీలక పత్రాలు, డిజిటల్ డాటాను స్వాధీనం చేసుకున్నట్లు ఇడి తెలిపింది.ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనల కింద ఇటీవల రవీంద్రన్‌కు చెందిన రెండు వ్యాపార కార్యాలయాలు, ఒక నివాస గృహంలో సోదాలు నిర్వహించినట్లు ఇది ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: ఎటిఎం చోరీలో క్రాష్ కోర్సు: నిరుద్యోగులే టార్గెట్ !

ప్రైవేట్ వ్యక్తుల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా బైజూస్ సిఇఓప చర్యలు తీసుకున్నట్లు ఇడి తెలిపింది. రవీంద్రన్ బైజూకు అనేక సమ్మన్లు జారీచేసినప్పటికీ ఆయన ఇడి ఎదుట హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఇడి తెలిపింది.
బైజూస్‌కు చెందిన థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2011 నుంచి 2023 మధ్య కాలంలో రూ. 28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) స్వీకరించిందని తమ దర్యాప్తులో తేలినట్లు ఇడి పేర్కొంది. అదే కాలలో విదేశీ పత్రయక్ష పెట్టుబడి పేరిట వివిధ విదేశీ సంస్థలకు రూ. 9,754 కోట్లను ఈ కంపెనీ చెల్లించిందని ఇడి వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News