Monday, December 23, 2024

టీచర్ నియామకాల కుంభకోణంలో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ నియామకాల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్‌కతాలోని అనేక ప్రదేశాలతోపాటు పొరుగున ఉన్న ప్రారంతాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే అరెస్టయిన రాష్ట్ర మాజీ విద్యా శాఖ మంత్రి పార్థా చటర్జీకి అత్యంత సన్నిహితుడిగా అనుమానిస్తున్న ఒక మాజీ పారా టీచర్ నివాసం ఉంటున్న కోల్‌కతా శివార్లలోని న్యూ టౌన్‌లోని పత్తర్‌ఘట మజర్ షరీఫ్ ప్రాంతంలో ఐదుగురు సభ్యుల ఇడి బృందం సోదాలు చేపట్టింది.

నగరంలోని నగర్‌బజార్ ప్రాంతంలో ఒక అకౌంటెంట్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. రాజర్‌హట్ ప్రాంతంలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న కొందరు వ్యాపారులు, టీచర్లు, దళారుల ఇళ్లలో కూడా ఇడి సోదాలు నిర్వహించింది. కోట్లాది రూపాయల ఈ కుంభకోణంలో డబ్బు ఎలా చేతులు మారిందన్న విషయాన్ని ఇడి దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News