Monday, January 20, 2025

ముడా కార్యాలయంలో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) స్థలాల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం అనేక ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటికే కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులను ఇడి చేర్చింది. మైసూరులోని ముడా కార్యాలయంతోపాటు ఇతర ప్రదేశాలలో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు.

వారికి భద్రతగా సిఆర్‌పిఎఫ్ బలగాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ముఖ్యమంత్రి లేదా ఆయన కుటుంబ సభ్యులకు చెందిన నివాసాల ఇళ్లలో తనిఖీలు జరగలేదని వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల సమక్షంలో ముడా కార్యాలయంలో పత్రాలను ఇడి అధికారులు పరిశీలించినట్లు వర్గాలు తెలిపాయి. తమ దర్యాప్తులో భాగంగా ముడా పత్రాలను ఇడి అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News