Sunday, December 22, 2024

పటాన్ చెరు ఎంఎల్ఎ ఇంట్లో ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఇడి సోదాలు చేపట్టింది. పటాన్ చెరు పట్టణంలో‌ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధు ఇళ్లల్లో ఏకకాలంలో ఇడి సోదాలు నిర్వహించింది. గురువారం తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి ఇడి అధికారులు చేరుకున్నారు. నియోజకవర్గంలో ఇడి సోదాలు చర్చనీయాంశంగా మారాయి. లగ్డారం గునుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ఇడి సోదాలు చేపట్టినట్టు సమాచారం. రాజకీయ కక్ష్యతోనే బిఆర్ఎస్ నేతల ఇళ్లపై బిజెపి ఇడితో దాడులు చేయిస్తోందని బిఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News