Thursday, January 16, 2025

కాంగ్రెస్ మంత్రి పర్సనల్ సెక్రటరీ ఇంట్లో నోట్ల కట్టలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జార్ఖండ్ మంత్రి కార్యదర్శికి చెందిన నౌకరు గదిలో లెక్కల్లో చూపని కరెన్సీ నోట్ల గుట్టను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు సోమవారం స్వాధీపం చేసుకున్నారు. నౌకరు గదిలో నుంచి పెద్ద పెద్ద సంచుల్లో నోట్ల కట్టలను ఇడి అధికారులు బయటకు తీసుకువస్తున్న వీడియోలు, ఫోటోలు వర్గాలు షేర్ చేశాయి. అందులో కేంద్ర భద్రతా సిబ్బందిని కూడా చూడవచ్చు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగిర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ వద్ద పనిచేసే నౌకరు చెందిన గదిగా అధికార వర్గాలు తెలిపాయి.

స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టల విలువ కచ్ఛితంగా ఎంత ఉందన్న విషయం అధికారికంగా తెలియరానప్పటికీ రూ. 20 కోట నుంచి రూ. 30 కోట్లు ఉండవచ్చని వర్గాలు తెలిపాయి. డబ్బంతా చాలా వరకు రూ. 500 నోట్ల రూపంలో ఉందని, కొంత మొత్తంలో బంగారు నగలు కూడా స్వాధీనం చేసుకున్నారని వారు చెప్పారు. కాంగ్రెస్ నాయకుడైన ఆలం(70) పాకూర్ స్థానం నుంచి జార్ఖండ్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్‌పై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి.

మాజీ చీఫ్ ఇంజనీర్ రామ్ గత ఏడాది అరెస్టు అయ్యారు. రాంచిలోని గ్రామీణ పనుల శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసిన రామ్ కాంట్రాక్టులు కేటాయించినందుకు ప్రతిఫలంగా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో భారీ ఎత్తున వసూలు చేశారు. ఆయనకు చెందిన రూ. 39 కోట్ల ఆస్తులను జప్తు చేసుకున్నట్లు గత ఏడాది ఏప్రిల్‌లో ఇడి ఒక ప్రకటనలో తెలిపింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రామ్, ఆయన కుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం గడిపారని ఇడి తెలిపింది. జార్ఖండ్ ఎసిబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్‌పై ఇడి దాడి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News