Wednesday, January 22, 2025

ఆతిఖ్ అహ్మద్ అనుచరుల నుంచి నగదు, బంగారం, వజ్రాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజకీయ నాయకుడిగా మారిన గ్యాగ్‌స్టర్ ఆతిఖ్ అహ్మద్ అనుచరు ల నుంచి పెద్దమొత్తంలో నగదు, బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం తెలిపింది.

పోలీసు ఎస్కార్ట్‌లో ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 15న ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(ఒకప్పటి అలహాబాద్)లో హత్యకు గురైన ఆతిఖ్ అహ్మద్ అనుచరులకు చెందిన 10 ప్రదేశాలలో ఇడి దాడులు జరిపింది. ప్రయాగ్‌రాజ్, లక్నో, న్యూఢిల్లీలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులలో రూ. 84.68 లక్షల నగదు, రూ. 60 లక్షలు విలువచేసే బంగారు కడ్డీ, రూ. 2.85 కోట్లు విలువచేసే వజ్రాల నగలు, డిజిటల్ పరికరాలు, వివిధ డాక్యుమెంట్లు లభించినట్లు ఇడి తెలిపింది.

ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, కంపెనీలు, సంస్థల ఆర్థిక పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటిస్వాధీనం చేసుకున్నట్లు ఇడి తెలిపింది. మనీలాండరింగ్ చట్టం కింద ఈ స్వాధీనం జరిగినట్లు ఇడి వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దాఖలు చేసిన క్రైమ్ నివేదిక ఆధారంగా ఆతిఖ్ అహ్మద్‌పై పిఎంఎల్‌ఎ దర్యాప్తు చేపట్టినట్లు ఇడి తెలిపింది. ఆతిఖ్ అనుచరులపై కిడ్రాప్, బెదిరింపు వసూళ్లు, దౌర్జన్యాలు వంటి ఆరోపణలు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News