Monday, December 23, 2024

21 న విచారణకు రండి

- Advertisement -
- Advertisement -

ED Send fresh summons to Sonia

సోనియాకు ఇడి తాజా సమన్లు

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 21వరకూ గడువు ఇచ్చింది. ఈ నెల 21న విచారణకు తమ ఎదుట హాజరుకావాలని సోనియా గాంధీకి నోటీసులు పంపించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కొవిడ్ కారణంగా ఆమె ఆసుపత్రిలో ఉండటంతో ఇడి ఎదుట ఆమె గత నెల 23న హాజరుకాలేకపొయ్యారు. హాజరీకి గడువు పొడిగించాల్సి వచ్చింది. హాజరీకి తమకు కనీసం నాలుగు వారాల సమయం అవసరం అని, వైద్య చికిత్స అనంతర జాగ్రత్తలను తెలియచేసుకోవడంతో సోనియాకు ఈ నెల 21 వ తేదీన హాజరు కావాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు వివరించాయి. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీని పలురోజులు ఏకబిగిన ఇడి విచారించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News