Sunday, December 22, 2024

విచారణకు రావాల్సిందే… కేజ్రీవాల్ కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రానంటే రానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పట్టుపట్టుకుని కూర్చుంటే.. నువ్వు రావాల్సిందే అంటూ నోటీసుల మీద నోటీసులు ఇస్తోంది ఈడీ. ఇప్పటికే ఏడుసార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ.. తాజాగా ఫిబ్రవవరి 27వ తేదీ మంగళవారం మరోసారి నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల మార్చి 4వ తేదీన విచారాణకు ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసులో తెలిపింది. మరి ఈసారి అయినా కేజ్రీవాల్ విచారణకు వెళ్తారో లేదో చూడాలి.

మరోవైపు, విచారణకు పేరుతో కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని తమపై బిజెపి బెదిరింపులకు పాల్పడుతోందని.. కేజ్రీవాల్ ను అరెస్టు చేసి ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఈడీని అడ్డం పెట్టుకుని మోదీ సర్కార్ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆప్ నేతలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News