Saturday, November 16, 2024

వెంకటేశ్వర హేచరీస్‌కు ఇడి షాక్: రూ.65 కోట్ల ఆస్తులు సీజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వెంకటేశ్వర హేచరీస్‌కు చెందిన రూ. 65 కోట్ల ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. ఫెమా చట్టం ఉల్లంఘించినట్టుగా వెంకటేశ్వర హేచరీస్ సంస్థపై ఇడి అధికారులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న వెంకటేశ్వర హేచరీస్ సంస్థకు చెందిన ఆస్తులను ఇడి అదికారులు జప్తు చేశారు. యూకేలో ఈ సంస్థ భారీగా ఆస్తులను కూడబెట్టిందని ఇడి అధికారులు గుర్తించారు.

యూకేలో వెంకీస్ ఓవర్సీస్ లిమిటెడ్ పేరుతో కంపెనీని వెంకటేశ్వర హెచరీస్ సంస్థ ఏర్పాటు చేసింది. యూకేలో అలెగ్జాండర్ హౌజ్ పేరుతో 90 ఎకరాల భూమిని వెంకటేశ్వర హేచరీస్ సంస్థ కొనుగోలు చేసింది . యూకేలోని బ్యాంకులో రుణం తీసుకొని ఈ భూమిని ఈ సంస్థ కొనుగోలు చేసింది. వెంకటేశ్వర హేచరీస్ సంస్థ డైరెక్టర్ల కోసం ఈ భూమిని కొనుగోలు చేసినట్టుగా ఇడి గుర్తించిందని మీడియా రిపోర్టు చేసింది. రూ. 65.5 కోట్లను వివొఎల్‌కు మళ్లించిందని ఇడి గుర్తించింది. ఈ నిధులను యూకేలోని బ్యాంకు రుణాన్ని వివోఎల్ తీర్చింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘిం చినట్టుగా ఇడి తేల్చింది. ఈ మేరకు ఈ సంస్థకు చెందిన మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ఆస్తులను ఇడి అటాచ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News