Monday, December 23, 2024

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2015 నుంచి ఇడికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్, అతని కుటుంబం, టిఎంసి నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్‌లతో సహా అనేక మందికి సంబంధించిన కేసులలో ఫెడరల్ ఏజెన్సీ తరపున ప్రాతినిధ్యం వహించారు.

లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లపై జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫైండింగ్ కేసు, హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాదులపై కేసుల వంటి విషయాలలోను రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించారు. ఎయిర్ ఇండియా స్కామ్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, భూషణ్ పవర్ అండ్ స్టీల్, రాన్ బాక్సీ రెలిగేర్ మోసం, స్టెర్లింగ్ బయోటెక్ స్కాం, పశ్చిమ బెంగాల్ పశువులపై మనీలాండరింగ్ కేసులు వంటి హై ప్రొఫైల్ కేసుల్లోనూ రాణా ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించి గొప్ప పేరు సంపాదించుకున్నారు.

ఫోర్బ్ మ్యాగజైన్ లీగల్ పవర్ లిస్ట్ ఆఫ్ 2020 లోనూ రాణాకి చోటు దక్కించుకున్నారు. ఇంత గొప్ప పేరు సంపాధించుకున్న నితీష్ రాణా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయటంపై సర్వత్ర చర్చనీయాంశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News