Friday, December 20, 2024

2న విచారణకు రావాలి: కేజ్రీవాల్ కు మళ్లీ ఈడీ నోటీసులు..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు ​​జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ సీఎంకు బుధవారం మళ్లీ సమన్లు ​​జారీ చేసింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది ఐదోసారి. ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చినా.. ఆయన విచారణకు మాత్రం హాజరుకాలేదు.

ఈ క్రమంలో మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈ సారిమాత్రం రావాల్సిందేనని కేజ్రీవాల్‌కు తేల్చి చెప్పింది.  ఫిబ్రవరి 2న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో తెలిపింది. మరి ఇప్పుడు కూడా కేజ్రీవాల్‌.. విచారణకు హాజరవుతారా? లేదో? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News