Thursday, January 23, 2025

రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు విపక్ష నేతలపై ఇడి చర్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రెండు రోజలు వ్యవధిలో ప్రతిపక్షాలకు చెందిన ముగ్గురు నేతలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) చర్యలను ఎదుర్కోవలసి వచ్చింది. కాంగ్రెస్ ఎంపి కార్తీ చిదంబరం శనివారం ఇడి అధికారులు ముందు హాజరు కాగా, బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు వేర్వేరు కేసుల్లో ఇడి ఎదుట హాజరు కాకపోవడంతో ఈ ఇద్దరికీ మరోసారి నోటీసులు జారీచేసింది. 2011లో 263 మంది చైనా పౌరులకు వీసాల జారీ విషయంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శనివారం కార్తీ చిదంబరం శనివారం ఇడి ఎదుట హాజరయ్యారు. అంతకు ముందు ఆయన ఇడి కార్యాలయం వెలుపల విలేఖరులతో మాట్లాడారు.‘ ఇడి విచారణకు పిలవడం కొత్త విషయమేమీ కాదు. ఇది దినచర్యగా మారింది.అవే పాతప్రశ్నలు.. అవే సమాధానాలు. ప్రస్తుతం క్రిస్మస్ సమయం. బహుశా శుభాకాంక్షలు చెప్పేందుకు పిలిచి ఉంటారు’ అని ఆయన అన్నారు.
కాగా గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో తేజస్వియాదవ్‌కు ఇడి శనివారం తాజాగా మరో సారి సమన్లు జారీ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్లుగా చెబుతున్న ‘లాండ్ ఫర్ జాబ్స్ స్కామ్’కు సంబంధించి ఇడి తేజస్విని ప్రశ్నిస్తోంది. కాగా జనవరి 5న విచారణకు హాజరు కావాలని ఇడి తాజా సమన్లలో పేర్కొంది. కాగా ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించి జనవరి 3 విచారణకు హాజరు కావలసిందిగా కేజ్రీవాల్‌కు ఇడి శుక్రవారం మరో సారి సమన్లు జారీ చేసింది. అంతకు ముందు రెండు సార్లు జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంతో ఇడి తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News