Sunday, April 6, 2025

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సిఎం సోరెన్‌కు సమన్లు

- Advertisement -
- Advertisement -

రాంచీ : మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం రాంచీలోని ఇడి కార్యాలయానికి రావాలని మంగళవారంనాడు జారీ చేసిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సోరెన్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉందని తెలిపారు. అయితే, ఏ కేసులో సోరెన్‌కు సమన్లు పంపించారనే విషయాన్ని వెల్లడించలేదు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో సోరెన్‌కు గతేడాది ఈడీ సమన్లు ఇచ్చింది. మైనింగ్ విషయంలో జరిగిన అవకతవకలపై ఆయన్ను గతంలో ప్రశ్నించింది. అయితే ఈసారి అదే కేసా.. ఇంకా మరేదైనా ఉందా అన్నది వెల్లడికాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News