ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా రెండు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ జలమండలిలో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 18న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అంతకు ముందు శనివారం సాయంత్రం ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి మార్చి 21న విచారణకు హాజరు కావాలని తొమ్మిదోసారి సమన్లు జారీ చేశారు. గతంలో ఇదే కేసులో జారీ చేసిన వాటికి ఆయన స్పందించక పోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు.
చీఫ్ మె్ర టోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆయనకు బెయి ల్ మంజూరు చేశారు. అదే రోజు సా యంత్రం , మరుసటి రోజు ఆయనకు సమన్లు జారీ చేయడంపై ఆప్ వర్గాలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ జ లమండలికి సంబంధించిన కేసులో త ప్పుడు కేసు నమోదు చేశారని ఢిల్లీ మం త్రి అతిశీ ఆరోపించారు. ఢిల్లీ జలమండలి బోర్డు కేసు గురించి ఎవరికీ తెలియ దు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయలేమని భావించిన కేంద్రం మరో తప్పుడు కేసుతో ఆయనను ఇబ్బం ది పెట్టాలని చూస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బిజెపి పన్నిన కుట్రలోభాగమే తాజా సమన్లు అని ఆమె విమర్శించారు.