Sunday, November 24, 2024

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులోఆ రాష్ట్ర సిఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగోసారి నోటీస్‌లు జారీ చేసింది. జనవరి 18న విచారణకు హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీస్‌లను కేజ్రీవాల్ తిరస్కరించారు. ఆ నోటీస్‌లు అక్రమంగా ఉన్నాయని, కేవలం తనను అరెస్టు చేసేందుకు నోటీస్‌లు ఇచ్చినట్టు కేజ్రీవాల్ ఆరోపించారు.

గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న హాజరు కావాలని ఆదేశించారు. కానీ మూడు సార్లూ ఆయన ఈడీ నోటీసుల్సి పట్టించుకోలేదు. మద్యం విధానం కేసులో ఇప్పటికే సీబీఐ ఆయనను గత ఏడాది ఏప్రిల్‌లో విచారించింది. కానీ సీబీఐ మాత్రం ఆప్‌నేతను నిందితుడిగా పేర్కొనలేదు. అయితే తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చిన తరువాత … కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News