Wednesday, January 22, 2025

జమ్మూకశ్మీర్ మాజీ సిఎం ఫ‌రూక్ అబ్దుల్లాకు ఈడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

 

Farooq

శ్రీనగర్: జమ్మూ క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడి) సోమ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 27న (బుధ‌వారం) త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు నోటీసుల్లో అబ్దుల్లాను ఈడి అధికారులు కోరారు. మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన కేసులో అబ్దుల్లాపై కేసు న‌మోదు చేసిన ఈడి,  తాజాగా ఆయ‌న‌ను విచార‌ణ‌కు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారిస్తున్న రోజే ఫ‌రూక్ అబ్దుల్లాకు ఈడి నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News