Friday, January 10, 2025

లాలూ, తేజస్వికి ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన ఉద్యోగాలకు భూమి కేసులో మనీలాండరింగ్ ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆయన తండ్రి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సమన్లు జారీచేసింది. డిసెంబర్ 2న ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలని తేజస్వి యాదవ్(34)ను ఆదేశించగా డిసెంబర్ 27న హాజరు కావాలని లాలూ ప్రసాద్(75)ను ఇడి ఆదేశించింది. పిఎంఎల్‌ఎ కింద వారి వాంగ్మూలాలను ఇడి నమోదు చేయనున్నది.

ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 11న తేజస్విని 8 గంటల పాటు ఇడి ప్రశ్నించింది. ఈ కేసులో లాలూ ప్రసాద్‌కు సమన్లు జారీ కావడం ఇదే మొదటిసారి. లాలూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న అమిత్ కాత్యాల్‌ను నవంబర్‌లో అరెస్టు చేసిన ఇడి ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్న అనంతరం తాజాగా తేజస్వి, లాలూకు సమన్లు జారీచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుపిఎ 1 ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ ఉన్న కాలంలో ఈ కుంభకోణం జరిగినట్లు ఇడి ఆరోపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News