- Advertisement -
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీచేసింది.
విదేశీ మారకం నిర్వహణ చట్టం(ఫెమా) కింద నమోడు చేసిన కేసులో ప్రశ్నించేందుకు అక్టోబర్ 27న(శుక్రవారం) తమ జైపూర్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని వైభవ్ గెహ్లాట్‌ను ఇడి సమన్లు జారీచేసింది.
200 మంది సభ్యులు గల రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25నఎన్నికలు జగరనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఇక్కడ పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్, బిజెపి మధ్యనే ఉంది.
- Advertisement -