- Advertisement -
మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు
ముంబయి: మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 4న తమ ఎదుట హాజరుకావాలంటూ శివసేన ఎంపి భావన గావలికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) బుధవారం నోటీసులు జారీచేసింది. మహారాష్ట్రలోని యావత్మాల్-వాషిమ్ స్థానం నుంచి 48 ఏళ్ల గావలి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ ముంబయిలోని ఇడి కార్యాలయంలో అక్టోబర్ 4న ఈ కేసుకు సంబంధించి హాజరుకావాలంటూ ఆమెకు ఇడి నోటీసులు జారీచేసిందది. పిఎంఎల్‌ఎ నిబంధనల కింద నమోదైన ఈ క్రిమినల్ కేసుకు సంబంధించి గావలి సహాయకుడు సయీద్ ఖాన్‌ను ఇడి మంగళవారం అరెస్టు చేసింది. ఫోర్జరీ, మోసపూరిత చర్య ద్వారా దాదాపు రూ. 18 కోట్లను స్వాహా చేసేందుకు ఒక ట్రస్టును ప్రైవేట్ కంపెనీగా మార్చేందుకు గావలి కుట్ర పన్నారంటూ ఖాన్‌ను ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరిచిన సందర్భంగా ఇడి పేర్కొంది. ఖాన్‌ను అక్టోబర్ 1వ తేదీ వరకు ఇడి కస్టడీకి కోర్టు అప్పగించింది.
- Advertisement -