Thursday, January 23, 2025

గేమింగ్ యాప్ కేసులో శ్రద్ధా కపూర్‌కు ఇడి సమన్లు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌లోతపాటు కమెడియన్ కపిల్ శర్మ, నటి హుమా ఖురేషీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) సమన్లు జారీచేసినట్లు తెలిసింది. ఇదే కేసులో అక్టోబర్ 6న తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ను ఇడి ఆదేశించగా తనకు కొంత వ్యవధి కావాలని ఆయన కోరినట్లు సమాచారం.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 50 కింద రణబీర్ కపూర్‌కు ఇడి సమన్లు జారీచేసింది.
మహదేవ్ ఆన్‌లైన్ ఆగేమింగ్ యాప్ కేసుకు సంబంధించి శ్రద్ధా కపూర్‌ను శుక్రవారం(అక్టోబర్ 6) తమ ఎదుట హాజరుకావాలని ఇడి ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఇడి ఎదుట నేడు శ్రద్ధాకపూర్ హాజరు అవుతారా లేదా అన్న విషయం తెలియరాలేదు. ఇదే కేసులో హీనా ఖాన్‌కు కూడా ఇడి సమన్లు జారీ చేయనున్నట్లు తెలిసింది.

ఈ గేమింగ్ యాప్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న ఈ నటులకు ఈ యాప్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికే ఇడి వీరిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది. కపిల్ శర్మతోపాటు హుమా ఖురేషిలను కూడా తమ ఎదుట హాజరుకావాలని ఇడి కోరినట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News