- Advertisement -
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలకు సమన్లు పంపింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరం అణిచివేతకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పనిచేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. నోటీసులు ఇవ్వడాన్ని సరికొత్త పిరికిపంద చర్యగా సూర్జేవాలా పేర్కొన్నారు.
- Advertisement -