Thursday, January 23, 2025

లిక్కర్ కేసులో మరో ఆప్ మంత్రికి ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆప్ మంత్రి కైలాష్ గెహ్లోత్ కు ఇడి అధికారులు సమన్లు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు విచారణకు ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపారు. మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఇడి అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇడి కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు.

2021-22 ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ రూపొందించిన ప్యానల్ లో ఆప్ మంత్రి కైలాష్ కూడా మెంబర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇడి అధికారులు ఆయనకు సమన్లు పంపించారు. ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ లను ఇడి అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News