Saturday, December 21, 2024

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‏కు ఈడీ నోటీసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‏కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‏ను నార్కోటిక్ బ్యూరో విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో నవదీప్‏కు నోటీసులు జారీ చేసిన ఈడి.. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

ఇక, 2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా సిట్ నవదీప్‏ను విచారించింది. ఆ కేసులో నవదీప్‏కు ఈడి రెండుసార్లు నోటీసులు అందజేసిన హాజరు కాలేదు. కాగా, ప్రస్తుతం మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతుండగానే..ఇప్పుడు మరోసారి నవదీప్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News