Wednesday, January 22, 2025

జార్ఖండ్ సిఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈనెల 24న హాజరు కావాలని ఆదేశించింది. భూ కుంభకోణం కేసులో దర్యాప్తునకు ఈనెల 14న హాజరు కావాలని అంతకు ముందు ఈడీ సొరేన్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన హాజరు కాలేదు. స్వాతంత్య్ర దినోత్సవాల కోసం తీరిక లేకుండా పనిచేస్తున్నానని, అందువల్ల తాను దర్యాప్తునకు హాజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు.

తాను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేనందువల్లనే తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్షంగా చేసుకున్నాయని ఆరోపించారు. సాహెబ్‌గంజ్‌లో చట్ట విరుద్ధంగా గనులను తవ్వినందుకు కేసు నమోదైంది. దాదాపు రూ.1000 కోట్ల విలువైన గనులను అక్రమంగా తవ్వినట్టు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో గత ఏడాది నవంబరులో సొరేన్‌ను ఈడీ ప్రశ్నించింది. ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాను అరెస్టు చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టినట్టు నమోదైన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News