Monday, December 23, 2024

శరద్ పవార్ మనుమనికి ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

ముంబయి : మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంక్ (ఎంఎస్‌సిబి) కుంభకోణంలో సాగిస్తున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని ఎన్‌సిపి సుప్రీమో శరద్ పవార్ మనుమడు, మహారాష్ట్ర ఎంఎల్‌ఎ రోహిత్ పవార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసినట్లు శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి.

బారామతి, పుణె, ఔరంగాబాద్, మరి కొన్ని ప్రాంతాలలో రోహిత్ పవార్ నేతృత్వంలోని బారామతి ఆగ్రో కార్యాలయంపైన, కొన్ని అనుబంధ సంస్థలపై ఇడి ఈ నెల 5న దాడులు నిర్వహించింది. 38 ఏళ్ల రోహిత్ పవార్ మహారాష్ట్ర శాసనసభలో కర్జత్= జమ్‌ఖేడ్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌సిపి ఎంఎల్‌ఎ. రోహిత్ బారామతి యజమాని, సిఇఒ. ఆయన ఎన్‌సిపిలో శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంఎల్‌ఎ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News