Monday, December 23, 2024

ప్రకాశ్ రాజ్‌కు ఈడి సమన్లు

- Advertisement -
- Advertisement -

రూ.100 కోట్ల స్కామ్ కేసులో విచారణ

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) సమన్లు జారీచేసింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో వచ్చేవారం విచారణకు రావాలని సూచించింది. తిరుచ్చికి చెందిన ఓ ఆభరణాల సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారణకు ఈడి పిలిచింది. బిజెపిపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నోటీసులు రావడం గమనార్హం.

తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ అనే పార్ట్‌నర్‌షిప్ కంపెనీపై నవంబర్ 20న ఇడి దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి తెలిపింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధిక రిటర్న్ ఇస్తామని ఈ మొత్తం సేకరించారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News