Saturday, December 21, 2024

సినీ నటి రకుల్ కు ఇడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు ఇడి నోటీసులు డ్రగ్స్ కేసు దర్యాప్తును ఇడి ముమ్మరం చేసింది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ (ఇడి) నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గతేడాది సెప్టెంబర్ 3న రకుల్‌ను ఇడి అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయింది. దీంతో ఇడి అధికారులు ఆమెను పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు .

ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని తాజాగా ఇడి అధికారులు రకుల్‌కు నోటీసులు జారీ చేశారు.
టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంపై 2017 జులైలో ఎన్‌డిపిఎస్ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులును విచారించారు. గతేడాది సెప్టెంబర్‌లో మనీలాండరింగ్ కింద ఈ కేసులో ఇడి అధికారులు విచారణ చేపట్టారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు పలువురికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News