Monday, December 23, 2024

సంజయ్ రౌత్ భార్య వర్షకు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

ED summons to Sanjay Raut's wife Varsha

ముంబై: మురికివాడల పునర్ అభివృద్ధికి సంబంధించిన భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపి సంజయ్ రౌత్ భార్య వర్షకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం సమన్లు జారీచేసింది. ముంబై శివార్లలోని గోరెగావ్‌లో పత్రా చాల్(మురికివాడల పునర్ అభివృద్ధి)కి సంబంధించి రూ. 1,034 కోట్ల ఆర్థిక అక్రమాలు జరిగినట్లు నమోదు చేసిన సంజయ్ రౌత్‌ను ఇప్పటికే ఇడి అరెస్టు చేసింది. కాగా..ఈ ఏడాది జనవరిలో పిఎంసి బ్యాంకు కుంభకోణం కేసులో వర్ష రౌత్‌ను ఇడి ప్రశ్నించింది. మాధురీ ప్రవీణ్ రౌత్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ. 55 లక్షలు తన ఖాతాలోకి బదిలీ అవడంపై వర్ష రౌత్‌ను ఇడి ప్రశ్నించింది. ఇలా ఉండగా..సంజయ్ రౌత్ ఇడి కస్టడీని ఈ నెల 8వ తేదీ వరకు పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు దర్యాప్తులో ఇడి మంచి పురోగతిని సాధించిందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News