Monday, January 6, 2025

సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు

- Advertisement -
- Advertisement -

ED summons to Sonia and Rahul Gandhi

 

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జూన్ 8 న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈమేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో సోనియా, రాహుల్ స్టేట్‌మెంట్లను రికార్డు చేసేందుకు వారికి సమన్లు జారీ చేసినట్టు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తదితరులు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అయాచితంగా పొందారంటూ బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి గతం లోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీ లోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ. 50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సాల్‌లను ప్రశ్నించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News