- Advertisement -
ముంబై: మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇడి దాఖలు చేసిన 7,000 పేజీల అనుబంధ చార్జిషీట్‌లో దేశ్‌ముఖ్ కుమారులను కూడా ఇడి నిందితులుగా చేర్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పిఎంఎల్‌ఎ) కేసులకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో ఇడి ఈ చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో 14 మంది నిందితులపై ఇడి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో దేశ్‌ముఖ్ ప్రైవేట్ కార్యదర్శి(అదనపు కలెక్టర్ ర్యాంకు అధికారి) సంజీవ్ పలందె, వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఈ ఏడాది నవంబర్ 1న దేశ్‌ముఖ్‌ను ఇడి అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
- Advertisement -