Sunday, November 24, 2024

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం నుంచి కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్రం, ఈడీకి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు  చేస్తున్నారు. ఇప్పటికే కవిత ఇంటి వద్దకు బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మాజీ మంత్రులు, తన్నీరు హరీశ్ రావు, కెటిఆర్ కూడా కవిత నివాసానికి చేరుకున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను భయపెట్టేందుకే కవితను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియా ముందు ఆరోపించారు. కవిత అరెస్ట్ పై ఆయన మాట్లాడుతూ.. పిట్ట బెదిరింపులకు భయపడం అన్నారు. కవితను 8.45 గంటలకు విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తామన్నారని చెప్పారు. ప్రణాళిక ప్రకారమే కవితను అరెస్టు చేశారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మహిళ అరెస్ట్ అంశంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని వెల్లడించారు.

సుప్రీంకోర్టు సూచనలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 19న సుప్రీంకోర్టులో విచారణ ఉండగానే అరెస్ట్ సరికాదని మండిపడ్డారు. బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. కవిత కోసం విమానం టికెట్ బుక్ చేసి మరీ అధికారులు సోదాలకు వచ్చారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు చాలా చూశామన్న ప్రశాత్ రెడ్డి కవిత తరుపున న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. మోడీ, రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న కుట్ర ఇది అని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కవిత్ అరెస్ట్ అన్నారు. మోడీ, రేవంత్ కుట్రలను  క్షేత్రస్థాయిలో ఎండగడుతామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News