Thursday, December 19, 2024

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఇడి దర్యాప్తు షురూ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై వచ్చిన ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు ప్రారంభించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఇడి ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిందనే వార్త రాకముందే పేటీఎం షేర్లలో భారీ పతనం నమోదైంది. పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లలో మళ్లీ 10 శాతం క్షీణత కనిపించింది. అది లోయర్ సర్క్యూట్‌కు చేరుకుంది. ఈ పతనం తర్వాత పేటీఎంషేర్లు మళ్లీ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయాయి. మార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కో షేరుకు రూ. 342.15 కనిష్ట స్థాయిని నమోదు చేశాయి, ఇది గత 52 వారాలలో కనిష్ట స్థాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News