హైదరాబాద్: ఇడి, సిబిఐ కోర్టులో శుక్రవారం నాడు ఎపి సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఈక్రమంలో పెన్నా కేసు నుంచి తొలగించాలన్న జగన్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్ కౌంటర్ దాఖలుకు సిబిఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తామన్న జగన్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తామని విజయసాయిరెడ్డి, శామ్యూల్ తెలిపారు. పెన్నా కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్ కౌంటర్ దాఖలుకు సిబిఐ గడువు కోరింది. పెన్నా, రఘురాం, ఇండియా సిమెంట్స్ ఛార్జిషీట్లపై విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది. ఇడి కేసుల విచారణ అంశంపై హైకోర్టు తీర్పు రావాల్సి ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి అభ్యర్థనతో ఇడి కేసుల విచారణను ఈనెల 20కి కోర్టు వాయిదా వేసింది.
ED trial of Jagan piracy cases in CBI court